ముత్యాల పోచమ్మ పునః ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేయండి
Make the Mutyala Pochamma re-installation festival a success
కమాన్ పూర్, డిసెంబర్ 24:
కమాన్ పూర్ మండల కేంద్రంలోని ముత్యాల పోచమ్మ పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు కోరారు. కమాన్ పూర్ ముత్యాల పోచమ్మ నూతన ఆలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల రెండు రోజుల పాటు బుధవారం, గురువారాల్లో పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బుధవారం పుణ్య వచన కార్యక్రమం, గురువారం ముత్యాల పోచమ్మ విగ్రహపునః ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. సంప్రదాయ పద్ధతిలో పాత ముత్యాల పోచమ్మ ఆలయం నుండి నూతన ఆలయంలోకి విగ్రహాలు నెలకొల్పే పునః ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ముత్యాల పోచమ్మ పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి గ్రామంలోని భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రామ పెద్దలు గడప కృష్ణమూర్తి, భూంపెల్లి రాజయ్య, అనవేన లక్ష్మీరాజం, కుక్క చంద్రమౌళి, మాల్యాల తిరుపతి, దాసరి గట్టయ్య, మచ్చగిరి రాము, జంగపెల్లి అజయ్, నగునూరి నర్సయ్య గౌడ్, పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, వడ్లకొండ తిరుపతి గౌడ్, బోనాల సత్యం, భూంపెల్లి మండయ్య, జంగపెల్లి శ్రీనివాస్, చాట్ల గట్టయ్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు.