మలయాళ నటి రెంజుష మీనన్ ఆత్మహత్య

- Advertisement -
Malayalam actress Renjusha Menon committed suicide
Malayalam actress Renjusha Menon committed suicide

తిరువనంతపురం, అక్టోబరు 30, (వాయిస్ టుడే): చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటి రెంజూష మీనన్ ఆత్మహత్యకు పాల్పడింది. స్త్రీ అనే సీరియల్ తో రెంజూష మీనన్ కెరీర్ ను ప్రారంభించింది. ఈ సీరియల్ మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. నిజలాట్టం, మగలుడే అమ్మ, బాలామణి వంటి సీరియల్స్ కనిపించి మెప్పించింది. సీరియల్స్ లోనే కాకుండా సినిమాల్లో కూడా తనదైన శైలిలో నటించి అందరి మన్ననలు పొందింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి తరువాత కూడా ఆమె తన నటనను కొనసాగిస్తూనే ఉంది.ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా రీల్స్ చేస్తూ నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. నేడు ఆమె తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణించడానికి కొన్ని గంటల క్రితమే రీల్స్ లో నవ్వుతూ నటించి మెప్పించిన ఆమె.. ఇప్పుడు శవమై కనిపించడం మలయాళ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అయితే ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు. ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని విచారిస్తున్నారు. 35 ఏళ్ల వయస్సులోనే ఆమె మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందని పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular