యూరియా కొరతపై రాజకీయం చేయకుండా రైతులకు అందించే ప్రయత్నం చేయండి
* డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలన్నింటిని రెండు నెలల్లో పరిష్కరించాలి
* తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో బిజెపి ఎంపీల సహకారం ఎప్పటికీ ఉంటుంది
* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో భేటీ అయి మల్కాజ్గిరి ఎంపి ఈటల రాజేందర్
హైదరాబాద్ ఆగష్టు 23
Malkajgiri MP Etala Rajender meets Minister Ponguleti Srinivasa Reddy
;తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఎంపీల సహకారం ఎప్పటికీ ఉంటుందని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తెలిపారు.ఈమేరకు శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో భేటీ అయి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పలు వినతి పత్రాలు మంత్రికి అందజేశారు.అనంతరం ఈటెల మీడియా తో మాట్లాడుతూ యూరియా కొరతపై రాజకీయం చేయకుండా రైతులకు అందించే ప్రయత్నం చేయండి. బాధ్యతగా వ్యవహరించండని చూసించారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలన్నింటిని రెండు నెలల్లో పరిష్కరించాలని డిమాండ్ చేసారు.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు విసిరి వేసినట్టు ఎక్కడో దూరంగా ఉన్నాయి. కేటాయింపులు సరిగా జరగలేదు.కరెంటు సౌకర్యం, రోడ్ల సౌకర్యం, డ్రైనేజీలు, లిఫ్ట్లు సరిగా లేవు. ఈ సమస్యలు పరిష్కారం కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాస ఉండటం కష్టంగా ఉంది. రెండు నెలల్లో పరిష్కారం చూపించాలని కోరడం జరిగింది.ఎవరికైతే కేటాయించారో వారిని మాత్రమే ఉండేలా చూడాలి. కొత్తగా ఇల్లు కేటాయింపులో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదు. నిజంగా పేదరికంలో ఉండి భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. కొన్ని చోట్ల ఇవ్వలేదు ఆ లిస్ట్ను కూడా ఈరోజు మంత్రి గారికి ఇచ్చాను. ఇల్లు లేని వారికి పేదవారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలి తప్ప పైరవీలకు చోటివ్వవద్దని కోరాను. పారదర్శకత పాటించాలని కోరామని తెలిపారు..బస్తీలలో నివసించే వారికి అక్కడే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తే వారికి జీవనోపాధి సమస్య ఉండదు. కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు, ఇళ్లల్లో పనిచేసే బ్రతికే వారికి అక్కడే ఇల్లు కట్టిస్తే లైవ్లీహుడ్ దెబ్బతినకుండా ఉంటుందనీ కోరాను, దీనికి మంత్రిగారు సుముకత వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం లో కట్టిన ఇళ్లను కేటాయించకపోవడం వల్ల దర్వాజాలు కిటికీలు పీక్కుని పోతున్నారు.. కావాల్సిన మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించి పేదవారికి ఇళ్లను కేటాయించాలని కోరాను. సిమెంట్ ధర, ఇనుము ధర, ఇసుక ధర, మేస్త్రీల ధర పెరిగింది ఐదు లక్షల రూపాయల్లో ఇల్లు కట్టడం సాధ్యం కాదు. కొన్ని నిబంధనలు సడలించి ఇల్లు కట్టుకునే వారికి సాయం అందించాలి. జవహర్ నగర్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు. అవి ఆర్మీ భూములు. డంపు యార్డ్ వాసన పక్కన భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకునే వారు అందరూ పేదవారే, కానీ రెండు మూడు లక్షల రూపాయల లంచం ఇస్తే తప్ప ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. రెవెన్యూ అధికారులు, బ్రోకర్లు కలిసి ఇబ్బందులు పెడుతున్నారు. ఇల్లు కూలగొట్టిస్తున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని పేదవాళ్లు కట్టుకునే ఇళ్లకు ఇబ్బంది పెట్టొద్దని మంత్రి దృష్టికి తీసుకు వచ్చాము. మల్కాజిగిరి జిల్లా DRC మీటింగ్ సంవత్సరంనర అయినా జరగలేదు వెంటనే నిర్వహించాలని శ్రీధర్ బాబు గారిని కోరుతున్నామన్నారు. నాలుగు లక్షల మెజారిటీతో నన్ను గెలిపించారు కాబట్టి బాధ్యతగా వారికోసం కష్టపడుతున్నాను. ప్రభుత్వం ఏదున్న ప్రజల సమస్యలను తీర్చాలి. ప్రజా సమస్యల పరిష్కారం జరిగే వరకు నా ప్రయత్నం కొనసాగుతుంది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టే నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని కాదు. వారు ఇన్ని ఇల్లు అని కేటాయిస్తారు తప్ప.. నిబంధనలు చూసుకోవాల్సింది రాష్ట్రమే. ఒకవేళ కఠిన నిబంధనలు ఉంటే రిలాక్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాము. ఎక్కువ ఇల్లు రాష్ట్రానికి రావాలనేది మా ఎంపీల కోరిక ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఎంపీల సహకారం ఎప్పటికీ ఉంటుంది.నేషన్ హైవేలు, రైల్వే పనుల కోసం మేమే కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు అందిస్తున్నాము.
యూరియా కొరత :
రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాల మేరకు ఇండెంట్ పెట్టుకొని స్టాక్ తెప్పించి ముందుగానే నిల్వ ఏర్పాటు చేసుకుంటారు.తెలంగాణలో ఎక్కడ ప్లాన్ కొరవడిందో తెలవదు. బాధ్యతగా వ్యవహరించాలి తప్ప కేంద్రం మీద నెపం నెట్టవద్దు.రాజకీయాల కంటే కూడా రైతులకు ఎలా యూరియా అందించాలి అనే ఆలోచన చేయాలి. వేరే వారి మీద నెట్టడం మంచిది కాదు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది అనేది మన ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము. రైతుబంధు, నేషనల్ హైవేలు, ఫ్లైఓవర్లు ఇతర రాష్ట్రాలతో పాటుగా మనకు కూడా వస్తున్నాయి. మాది సంకుచితంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు. వైస్ ప్రెసిడెంట్ కు ఓటు వేయమని ముఖ్యమంత్రి అందరినీ కోరడం చేయడం సహజం. కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని అని అన్నారు.


