Sunday, September 8, 2024

మల్కాజిగిరి బీజేపీ టికెట్ మల్కా కొమురయ్యకు?

- Advertisement -

మల్కాజిగిరి బీజేపీ టికెట్ మల్కా కొమురయ్యకు?
ఆర్ఎస్ఎస్ తో పలు దశాబ్దాలుగా గట్టి అనుబంధం
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కు దాదాపు టికెట్ ఖరారు
గట్టి పోటీని తట్టుకుని టికెట్ సాధించిన కొమురయ్య
విద్యాసంస్థల అధిపతిగా మంచి పేరు.. పరిచయాలు
విద్యావంతుడు, కుటుంబ నేపథ్యమూ కలిసొచ్చిన వైనం
ఓ దశలో మల్కాజ్ గిరి లో ప్రధాని మోదీ పోటీచేస్తారనే ప్రచారం
ఈటల సహా పలువురి పేర్లు.. చివరకు కొమురయ్యకు?
(వాయిస్ టుడే ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్)
ఆయన ఇంటి పేరు ‘మల్కా’. అందుకేనేమో ఆయనకు మల్కాజిగిరి టికెట్ దక్కనుంది. దేశంలోనే అత్యంత పెద్ద లోక్ సభ నియోజకవర్గం.. నిన్నటివరకు తెలంగాణ సీఎం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం టికెట్ ఆయనను వరించనుంది. అంతేకాదు.. ఏకంగా ప్రధాని మోదీ పోటీ చేస్తారని ప్రచారం జరిగిన మల్కాజిగిరి టికెట్ ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల చైర్మన్ మల్కా కొమురయ్యకు రానుంది. ఇది బీజేపీలోని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. వాస్తవానికి ఈ టికెట్ కోసం బీజేపీ అగ్ర నాయకులు ఈటల రాజేందర్, మురళీధర్ రావు, పన్నాల హరీశ్ రెడ్డి, సామ రంగారెడ్డి వంటి పోటీకి నిలిచారు. వారందరిలోంచి చివరకు మల్కా కొమురయ్యను సీటు వరించనుంది.
విద్యా సంస్థల అధిపతిగా..
మల్కా కొమురయ్యది కరీంనగర్ జిల్లా. వీరి కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. అందరూ విద్యావంతులైన కుటుంబం వీరిది. కొమురయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కావడం విశేషం. వీరి దగ్గరి బంధువు న్యాయ వ్యవస్థలో ఉన్నారు. ఇక మల్కాజిగిరి ప్రాంతంలో ఆయన విద్యా సంస్థలకు విశేషమైన పేరుంది. దీంతోపాటు దశాబ్దాలుగా పెద్దఎత్తున పరిచయాలు ఉన్నాయి. విద్యావంతుడు కావడం, కుటుంబ నేపథ్యమూ కలిసిరావడం.. అన్నిటికిమించి తటస్థ అభ్యర్థిగా నిలవడంతో మల్కా కొమురయ్యను మల్కాజిగిరి టికెట్ కు బీజేపీ అధిష్ఠానం సరైన చాయిస్ గా పరిగణించినట్లు సమాచారం.
ఆర్ఎస్ఎస్ లో సభ్యత్వం..
కొమురయ్య కుటుంబానికి ఆర్ఎస్ఎస్ తో దశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఈ నేపథ్యం కూడా ఆయన పేరును మల్కాజిగిరి వంటి ప్రతిష్ఠాత్మక లోక్ సభ సీటుకు పరిశీలనకు కారణమైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణ, విలువలకు మారు పేరు. బీజేపీకి సైద్ధాంతిక మార్గదర్శి. అలాంటి సంస్థతో సుదీర్ఘ అనుంబంధం రాజకీయంగా తొలి అడుగులకు కొమురయ్యకు కలిసొచ్చిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇంటి పేరులో మల్కా .. పోటీకి దిగేది ’మల్కా’జిగిరి
కొమురయ్య ఇంటి పేరు మల్కా. చిత్రంగా ఆయన పోటీకి దిగనున్నది కూడా మల్కాజిగిరి నుంచే. కొమురవెల్లి మల్లన్నను ఇష్టదైవంగా కొలిచే కరీంనగర్ ప్రాంతం వారు కావడంతో ఆయనకు కొమురయ్య అనే పేరు పెట్టారు. అందులోనూ మల్కాజిగిరిలోనూ మల్లన్న అనే అర్థం ఉంది. మరో విషయం ఏమంటే మల్కాజిగిరి నుంచి 2014లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మల్లారెడ్డి కూడా విద్యా సంస్థల అధిపతినే. ఇప్పుడు కొమురయ్య కూడా విద్యా సంస్థలకు అధిపతినే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్