మల్లన్న జాతర ఆహ్వాన పత్రికను

- Advertisement -

మల్లన్న జాతర ఆహ్వాన పత్రికను

Mallanna fair invitation letter

జువ్వాడి కృష్ణారావుకు అందజేత

కోరుట్ల,
:కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో ఆదివారం నుండి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్న శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న )జాతర మహోత్సవానికి రావలసిందిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావుకు డబ్బా గ్రామ ప్రజలు ఆహ్వాన పత్రిక అందజేశారు.. మాజీ ఉప సర్పంచ్ బూస రాజేశ్వర్ ఇతర గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం కోరుట్ల పట్టణంలోని కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో కలిసి ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు.. గతంలో ఆలయ అభివృద్ధికి, సిసి రోడ్డుకు నిధులు మంజూరు చెయించారని అందుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని అలాగే ఆలయం చుట్టూ ప్రహరీ గోడ తదితర అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చెయించాలని కృష్ణారావును  గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా డబ్బా మల్లికార్జున స్వామి ఆలయానికి తప్పకుండా నిధులు మంజూరు కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో భూస రాజేశ్వర్, దేశెట్టి జీవన్, జానా శంకర్ తదితరులు ఉన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular