Sunday, September 8, 2024

వరుస కేసులతో మల్లారెడ్డి…

- Advertisement -

వరుస కేసులతో మల్లారెడ్డి…
హైదరాబాద్, మార్చి 20
: పాలమ్మిన, పూలమ్మిన, కష్టపడ్డ, పైకొచ్చిన.. అంటూ ఓవర్ నైట్ లో సోషల్ మీడియా స్టార్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. దుండిగల్ పరిధిలో చెరువు శిఖం భూముల్లో మల్లారెడ్డి నిర్మించిన కాలేజీ నిర్మాణాలను అధికారులు ఇటీవల కూల్చేశారు. ఇది మర్చిపోకముందే మైసమ్మగూడలోని ఆయన కాలేజీల్లో ఐటి అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. మొత్తం పదిమంది అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది. మేనేజ్మెంట్ కోట సీట్లను బ్లాక్లో అమ్ముకున్నారనే ఆరోపణలతో అధికారుల బృందం ఈ సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాలేజీలో పనిచేస్తున్న సిబ్బందిని అధికారులు ప్రశ్నించారని సమాచారం.. ఆదాయానికి మించిన ఆస్తులు, బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన భూముల వివరాలను ఐటి అధికారులు గుర్తించారని ప్రచారం జరుగుతున్నది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ పన్ను ఎగ్గొట్టారని మల్లారెడ్డి పై తీవ్ర విమర్శలు ఉన్నాయి.. ఆ దిశగానే పలు కీలక రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి అగ్రికల్చర్ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులను డిటైన్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అదికూడా మల్లారెడ్డి యూనివర్సిటీలోనే కావడం విశేషం. ఈ ఘటనపై మల్లారెడ్డి కోడలు స్పందించారు. విద్యార్థులు దిష్టిబొమ్మ దహనం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక హనుమంతరావు కుట్ర దాగుందని ఆమె ఆరోపించారు. ఈ ఘటన మర్చిపోకముందే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు దాడి చేయడం విశేషం. గత ఏడాది కూడా ఐటి అధికారులు ఇదే స్థాయిలో మల్లారెడ్డి విద్యా సంస్థలపై దాడులు నిర్వహించారు. అప్పట్లో కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఐటి దాడులు మొదలయ్యాయి. ఈ ఐటి విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయనేది సాయంత్రం అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.వరుస దాడులు, కూల్చివేతల నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల రేవంత్ రెడ్డి తనకు దోస్తని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.. ఇక సోమవారం తన నియోజకవర్గ పరిధిలోని కొంతమంది నాయకులతో మల్లారెడ్డి సమావేశమయ్యారు. పార్టీ మారతానని వారి ఎదుట ప్రస్తావించినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి గేట్లు తెరిచారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంకా చాలామంది లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. మరి రేవంత్ రెడ్డి మల్లారెడ్డి రాకను స్వాగతిస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సింది ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్