Sunday, September 8, 2024

మండల అభివృద్ధికి హామీ  కావాలి

- Advertisement -

అభ్యర్థి మారితే అభివృద్ధి జరుగుతుందా!.

మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అలస్యందేనికి

అద్దె భవనంలో ITI కాలేజీ నిర్వహణ ఈ ప్రభుత్వానికి కనబడలేదా?.

నీరటి రామ్ ప్రసాద్,రాష్ట్ర అధ్యక్షుడు-NSF.

Mandal development should be guaranteed
Mandal development should be guaranteed

మండల ప్రజల ఆకాంక్షలు గాలికి వదిలేసి ఎన్నికలు రాగానే అభ్యర్థిని మార్చితే అభివృద్ధి జరుగుతుందా అని అధికార పార్టీని “నవతరం స్టూడెంట్ ఫెడరేషన్(NSF)” రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్ ప్రశ్నించారు, శనివారం రోజున జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన NSF నాయకుల సమావేశంలో పాల్గొన్నా రామ్ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో పోరాటాలతో మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ITI కాలేజీలు సాధించుకున్నాం అని అయినప్పటికీ మన రాష్ట్రం మన పాలన అని ఎన్నికల్లో గెలిచిన ఈ ప్రభుత్వ పాలనలో కూడా గత 9సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు త్రాగునీరు కోసం ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారని మరియు ITI కాలేజీ పక్క భవనం లేక అందులో చదువుకున్నా విద్యార్థులు కూడా ఒక్క రెండు సంవత్సరాల తరువాత ఏదైనా పని నిమిత్తం కాలేజీకి వెళదాం అని చూస్తే అద్దె భవనం కావడం వల్ల ప్రతిసారి ఒక్క కొత్త బిల్డింగ్ లోకి మార్చడం వల్ల కాలేజీ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి మండలంలో నెలకొందని ఆయన అన్నారు, మండలంలో విద్యావ్యవస్థను అభివృద్ధి చేయండయ్యా అని వేడుకుంటుంటే 9ఏండ్లుగా పట్టించుకోకుండా మళ్లీ ఎన్నికలు రాగానే అభ్యర్థిని మర్చి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు ఈ అధికార పార్టీ చేస్తుందని దుయ్యబట్టారు, నిజంగా అభ్యర్థి తప్పిద్ధం వల్లే మండలంలో అభివృద్ధి జరగకపోతే 9సంవత్సరాలుగా ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు ఎందుకు జోక్యం చేసుకోలేదు, ఈ మండల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో లేరా అని ప్రశ్నించారు, ఇప్పుడు ఎన్నికలు రాగానే నియోజకవర్గన్నీ సిద్దిపేట లాగా చేస్తాం, సిరిసిల్ల లాగా చేస్తాం అంటూ కబుర్లు చెప్తున్న నాయకులని ఒక్కటే ప్రశ్నిస్తున్నాం తెలంగాణ అంటే కేవలం ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలు మాత్రమేనా, మిగతా నియోజకవర్గ లు ఈ 9ఏండ్ల పాలనలో అభివృద్ధి కాలేదని మీరు అంగీకరిస్తున్నారా! అని ఈరోజు విద్యార్థుల పక్షాన NSF వేదికగా మిమ్ములను ప్రశ్నిస్తున్నాం అన్నారు.

అదే విధంగా 4జిల్లాల సరిహద్దులను పంచుకుంటూ జిల్లాలో చివరన ఉండి మండలంలో అభివృద్ధికి నోచుకోవడం లేదు, మండల విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూరప్రాంతలకు వెళ్లడానికి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు, కాబట్టి మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో పోరాటాలు చేస్తూ, మొదటి హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి గారికి మా విన్నపాన్ని తెలుపుకుంటామని వెళ్తే పోలీసులతో దాటి చేయించి మా దీక్ష శిబిరాన్ని కూల్చేసి కేసులు పెట్టి ఇబంధులు పెట్టె ప్రయత్నాలు చేశారు కానీ  9ఏండ్లలో డిగ్రీ కాలేజీ మాత్రం ఏర్పాటుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఈ సంధర్భంగా మండలంలోని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మరియు మండల ప్రజానీకానికి ఒక్కటే పిలుపునిస్తున్నాము మనకు కావాల్సింది అభ్యర్థి మర్పో, పార్టీ మర్పో కాదు మన మండల అభివృద్ధి మన మండలంలో విద్య,వైద్య, ఉపాధి అవకాశాలు ఎన్నికల కోసం వచ్చే అభ్యర్థులు మందు, చిందు, డబ్బు గురించి కాకుండా ముందు అభివృద్ధి కి సంబంధించి ఎలాంటి హామీ ఇస్తారో అడగాలని పిలుపునిచ్చారు, అంతేకాకుండా ప్రతి ఒక్క అభివృద్ధి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు మరియు ITI కాలేజీలు పక్క భవనం మరియు వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి సంబంధించిన స్వస్థమైన హామీలతో ప్రజల ముందుకు రావాలని లేకపోతే నిరాశ తప్పదని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో NSF రాష్ట్ర నాయకులు నీరటి రాకేష్, రంజిత్ మరియు మండల నాయకులు మహేష్, ప్రశాంత్,రఘు,సతీష్,నగేష్ తదితరులు పాల్గొన్నారు.

నీరటి రామ్ ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు-NSF. నవతరం స్టూడెంట్ ఫెడరేషన్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్