మంగళగిరి సీఐ అత్యుత్సాహం.. బదిలీ వేటు

- Advertisement -

పవన్‌ కల్యాణ్‌ ఆఫీసులో మంగళగిరి సీఐ అత్యుత్సాహం.. బదిలీ వేటు
మంగళగిరి జూన్ 27
మంగళగిరిలోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యాలయంలో భద్రతా సిబ్బందితో సీఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించారు. బుధవారం పవన్‌ కల్యాణ్‌ ఉన్న సమయంలోనే అనుమతి లేకుండా ఆఫీసులోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారాహి దీక్షలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ అమ్మవారికి పూజలు చేస్తున్న సమయంలోనే ఆయన లోపలికి వెళ్లేందుకు ట్రై చేశారు. దీంతో కొద్దిసేపు వెయిట్‌ చేయమని చెప్పిన భద్రతా సిబ్బందిపై సీరియస్‌ అయ్యారు. వాళ్ల మాటలు పట్టించుకోకుండా బూటు కాళ్లతోనే లోపలికి వెళ్లారు.మంగళగిరి టౌన్‌ సీఐ శ్రీనివాసరావు దురుసు ప్రవర్తనపై డిప్యూటీ కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం సీఐ వినోద్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు.సీఐ శ్రీనివాసరావు గతంలో కూడా జనసేన నాయకులతో ఇలాగే దురుసుగా ప్రవర్తించారు. ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఉండే అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular