సింగరేణి అధికారులతో సమావేశం నిర్వహించిన మంథని ఆర్డీవో

- Advertisement -

ఆర్అండ్ఆర్ కమిటీ సభ్యులు, సింగరేణి అధికారులతో సమావేశం నిర్వహించిన మంథని ఆర్డీవో
మంథని

Manthani RDO held a meeting with Singareni officials :

లద్నాపూర్ గ్రామా ఆర్అండ్ఆర్ కమిటీ సభ్యులు మరియు సింగరేణి అధికారులతో  ఆర్అండ్ఆర్ అధికారి,మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి వి.హనుమా నాయక్ శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.
లద్నాపూర్ గ్రామానికి సంబంధించిన సమస్యల పై మంథని పట్టణంలోని మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయములో  రెవెన్యూ డివిజనల్ అధికారి వి.హనుమా నాయక్ అధ్యక్షతన సమావేశము నిర్వహించి పలు అంశాలను చర్చించారు.లద్నాపూర్ గ్రామములో గల పోచమ్మ దేవాలయము తరలించుటకు నిర్ణయం తీసుకున్నారు. పన్నూరు, రత్నాపూర్ ఆర్అండ్ఆర్ కాలనీ పరిధిలో మౌళిక వసతులు ఏర్పాటు చేయుటకు ఆదేశాలు జారీ చేశారు. లద్నాపూర్ గ్రామము బ్లాస్టింగ్ ప్రభావిత ప్రాంతము పరిధిలో ఉన్నందున నిర్వాసితులు వారి యొక్క ఇండ్లను ఖాళీ చేయు విషయములో సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశములో ఆర్జీ 3 సింగరేణి అధికారులు  ఎస్ ఓ జి. రఘుపతి,ఈ. లక్ష్మినారాయణ,కే. రాజేందర్,కే ఐలయ్య, డివై మేనేజర్ కోల శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular