బీఆర్‌ఎస్ సర్కార్‌లోనే ఆధ్యాత్మికతకు గుర్తింపు
-ఆధ్యాత్మిక చింతనతోనే సమసమాజం బాగుంటుంది
-మంథని గొప్పతనాన్ని..విశిష్టతను ముందుకు తీసుకెళ్లాం
-బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అధ్యాత్మకతకు గొప్ప గుర్తింపు లభిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్ట మధూకర్ అన్నారు.
మంథని పట్టణంలోని నృసింహ శివ కిరణ్ గార్డెన్స్‌లో శ్రీ జనార్థన సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపార వేత్త గట్టు నారాయణగురూజీ సౌజన్యంతో జరుగుతున్న వేద విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేదాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన మంథనిలో వేద పాఠశాల లేకపోవడంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని కులాలు, మతాలు సమానమని చాటి చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తారని, ఏ కార్యక్రమం చేపట్టినగా ముందుగా హోమ కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే సమసమాజం బాగుపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మర్చిపోయిన మారిపోయిన మంథని ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గట్టు నారాయణగురూజీ ఈప్రాంతంపై ఉన్న ప్రేమతో అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. ఒక సమయంలో మజీదు నిర్మాణానికి రూ.50వేలు అందించిన ఘనత ఆయనదేనని అన్నారు. ఇతర కులాల వారిని ద్వేషించవద్దని, దూరం చేసుకోవద్దనే ఆలోచన ఆయనదని కొనియడారు. తన హయాంలోమంథని గొప్పతనాన్ని, విశిష్టతతో పాటు ఆలయ భూములను రక్షిస్తూ ఆచారాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లామని ఆయన అన్నారు. మంథని ప్రాంతంలో ఆధ్యాత్మిక చింతన మరింత పెంపొందిచే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.