Wednesday, January 15, 2025

జోగులాంబ ఆలయంలో మంత్రి పొన్నం పూజలు

- Advertisement -

జోగులాంబ ఆలయంలో మంత్రి పొన్నం పూజలు

Mantri Ponnam Pujas at Jogulamba Temple

అలంపూర్
ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ముందుగా అయనకు  ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.. మొదటగా గణపతికి అభిషేకాలు, అనంతరం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన నిర్వహించారు.. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు..ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు..
అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనానంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని..ప్రజల కోసం ప్రజా పరిపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వానికి సామర్థ్యాన్ని,ఆశీర్వచనాన్ని ఇస్తూ ప్రజలకు ఎలాంటి పకృతి వైపల్యాలు జరగకుండా చూడాలని అమ్మవారిని కోరుకున్నాను అని అన్నారు..ప్రభుత్వాన్ని అస్థిర పరిచే శక్తులన్నీ బలహీనపడి భక్తులకు సేవ చేసే ప్రభుత్వాన్ని బలపరిచాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అని అన్నారు..కేంద్ర ఆర్కాలజీ డిపార్ట్మెంట్ తో చర్చించి ఇక్కడి స్థానిక నాయకుడు సంపత్ కుమార్ తో కలిసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం అని అన్నారు..వారం రోజుల్లోగా భక్తుల సౌకర్యార్థం అమ్మవారి హారతి సమయానికి ఆర్టీసీ బస్సులన్నీ ఏర్పాటు చేస్తాం అని అన్నారు..మా సంఘానికి సంబంధించిన వ్యక్తులతో ట్రస్ట్ ఏర్పాటుచేసి వేములవాడ మాదిరిగా భక్తుల కోసం ఈ పుణ్యక్షేత్రంలో వసతి సదుపాయం ( సత్రం ) నిర్మాణం చేస్తాం అని అన్నారు..అనంతరం పాపనాసిశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్