Sunday, September 8, 2024

మార్చ్ 23న జర్నలిస్టుల కోర్కెలదినం!

- Advertisement -

భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ…

మార్చ్ 23న జర్నలిస్టుల కోర్కెలదినం!

జయప్రదం చేయండి – APUWJ .

అమరావతి, మార్చ్ 12 : సర్దార్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ మార్చ్ 23 వ తేదీన దేశవ్యాప్తంగా జరప తలపెట్టిన జర్నలిస్టుల కోర్కెలదినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) పిలుపు ఇచ్చింది.

ఆమేరకు ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలను అన్ని రాజకీయ పక్షాల నేతల , అభ్యర్థుల దృష్టికి తీసుకు వెళ్ళాలని , ఎన్నికల ప్రణాళికల్లో జర్నలిస్ట్ ల సమస్యలకు స్థానం కల్పించాలని కోరుతూ, అమరజీవి సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి రోజయిన మార్చ్ 23 న దేశవ్యాప్తంగా “జర్నలిస్టుల కోర్కెల దినం” పాటించాలని ఇటీవల షిరిడీ లో జరిగిన ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు పిలుపు ఇచ్చినట్లు వారా ప్రకటనలో తెలిపారు.

ఐ.జే.యు. పిలుపును ఆంధ్రప్రదేశ్ లో జయప్రదం చేయాలని , రాజకీయ పక్షాల నేతలకు , ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు , వినతిపత్రాలు ఇవ్వాలని వారా ప్రకటనలో కోరారు.

“దేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ , డిజిటల్ మీడియా అపారంగా విస్తరించడంతో మీడియా స్వరూప స్వభావాలలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని మీడియా స్థితిగతులను అధ్యయనం చేయడానికి “మీడియా కమిషన్” ఏర్పాటు చేయాలని, మీడియా సిబ్బందిపై, మీడియా సంస్థలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో మీడియా భద్రత కోసం వెంటనే ఒక ప్రత్యేకచట్టం చేయాలని, 2007 లో ఏర్పాటైన మజీధియా వేతన సంఘం తర్వాత గత పదిహేనేళ్ళుగా వర్కింగ్ జర్నలిస్టుల వేతనాలలో సవరణ జరగనందున వెంటనే కొత్త వేజ్ బోర్డును నియమించాలని కోరుతూ వినతిపత్రాలు ఇవ్వాలని” వారా ప్రకటనలో పిలుపు ఇచ్చారు.

సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి రోజున ఆయన అమరత్వాన్ని స్మరిస్తూ కోర్కెలదినం కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండలాల్లో నిర్వహించాలని ఐ .వి. సుబ్బారావు, చందు జనార్ధన్ పిలుపు ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్