నర్సాపూర్ లో వివాహిత మృతి

- Advertisement -
married-woman-dies-in-narsapur
married-woman-dies-in-narsapur

నర్సాపూర్:ఆగస్టు 12: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన నర్సాపూర్ మండల పరిధిలోని మూసాపేట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

పోలీసుల కథనం మేరకు.. నాలుగేళ్ల క్రితం నర్సాపూర్ మండలం మూసాపేట గ్రామానికి చెందిన అనిల్ కుమార్ కు, జీడిమెట్ల శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన నీలమ్మ మల్లేశం దంపతుల కూతురు ప్రియాంక ను(25) ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు బైక్, బంగారం, కట్నకానుకలు ఇచ్చి వివాహం జరిపించారు.

నాలుగు నెలల వరకు వారి కాపురం సజావుగా సాగింది. ఇక అప్పటి నుంచి అనిల్ కుమార్ భార్య ప్రియాంక ను అదనపు కట్నం కోసం వేధించ సాగాడు. ఇదే విషయమై ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు సర్ది చెపినా.. తరచూ గొడవలు జరుగుతుండేవి.

వివాహం జరిగి నాలుగేళ్లయినా.. వారికి పిల్లలు పుట్టడం లేదని నిత్యం రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ పరిణామాల మధ్య తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక శుక్రవారం రాత్రి అనుమానస్పదంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular