- Advertisement -
కోనసీమ : రామచంద్రాపురం మండలం దాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు ఆరు వేల మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ దంపతులు విచ్చేసి వ్రతమును ఆచరించారు. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి టి.తారకేశ్వరావు, సాయిప్రసాద్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -