Sunday, September 8, 2024

మాతృ శక్తిని చాటి చెప్పాలి

- Advertisement -
Matri Shakti should be mentioned

—పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారు

—మహిళా శక్తి సమ్మేళన సమితి రాష్ట్ర బాధ్యులు, సామాజిక కార్యకర్తలు లింగం ఉజ్వల, జొన్నలగడ్డ నాగశ్రీ శారదాంబ

—ప్రధాన వక్త కొంపెల్లి మాధవీ లత ల వ్యాఖ్యలు

కరీంనగర్ ఫిబ్రవరి 11(వాయిస్ టుడే)కరీంనగర్ పట్టణం తీగలగుట్టపల్లిలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో మహిళా శక్తి సమన్వయ సమితి కరినగరము విభాగ్ మహిళా శక్తి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య వక్తలు హాజరైన మహిళా శక్తి సమ్మేళన సమితి రాష్ట్ర బాధ్యులు, సామాజిక కార్యకర్తలు లింగం ఉజ్వల, జొన్నలగడ్డ నాగశ్రీ శారదాంబ , ఆధ్యాత్మిక వేత్త మాధవీ లత లు మాట్లాడుతూ నేటి సమాజంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగి ఉన్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అనచబడ్డారన్నారు. దీంతో అనేకమంది సంఘసంస్కర్తలు మహిళల సమాన హక్కుల కల్పన కోసం కృషి చేశారన్నారు. నేటి కాలంలో మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చి సమస్యలను అధిగమించి ఇష్టమైన రంగాల్లో తమ ప్రతిభతో రాణిస్తున్నారని, వీరు చరిత్రను లిఖించడమే కాకుండా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. మహిళా శక్తిని చాటి చెప్పాలన్నారు .మహిళలు చైతన్యం కలిగించడం ద్వారా భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడం, వివిధ రంగాల్లోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కార మార్గమును కనుగొనటం, మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం అనే ఉద్దేశంతో మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళల్లో చైతన్యం కల్పించడం కోసం ఇట్టి కార్యక్రమం ఎంతో దోదపడుతుందన్నారు. సమాజంలో మహిళ పాత్ర కీలకంగా ఉందని, మహిళలు ప్రధానంగా తమ పిల్లలను సమాజానికి పనికొచ్చే విధంగా ప్రయోజకులను చేయాలనే లక్ష్యం , చైతన్యం కలిగి ఉండాలన్నారు. మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమం లాంటివి మహిళలను చైతన్య పరచడమే కాకుండా, వారిలోఅంతర్గతంగా ఉన్న సృజనాత్మక ను వెలికి తీసేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. ఇట్టి సమ్మేళనం సందర్భంగా పలు అంశాలపై చర్చ కార్యక్రమం జరిగింది. అనంతరం మరో వక్త, ఆధ్యాత్మికవేత్త కొంపెల్లి మాధవి లత ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ సృష్టిలో స్త్రీ శక్తి అపూర్వమని అన్నారు. ప్రతి స్త్రీలో ఉన్న మాతృత్వాన్ని జాగృతం చేయాలని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రధాన సంరక్షకులు స్త్రీలే అని కొనియాడారు ఇట్టి కార్యక్రమంలోప్రభుత్వ ,పారిశ్రామిక ,సామాజిక సేవ ,విద్యా , వైద్యరంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ మహిళలలు, ముఖ్య అతిథులు డాక్టర్ శేష శైలజ , బొడ్ల గీతారాణి, కోడూరి శ్రీవాణి, లెక్కల గీతారెడ్డి పాటు మహిళా శక్తి సమ్మేళనం కరీంనగర్ విభాగ్ స్వాగత సమితి బాధ్యులు డాక్టర్ ఆకుల శైలజ, ముక్క రాజ శ్రీ, డాక్టర్ నందికొండ శ్రీ లక్ష్మీ రెడ్డి, కంజర్ల శ్రీలత, డాక్టర్ అన్ని తిరుమల సరిత, ముక్క స్వప్న, డా.దేవరకొండ శశి ప్రభ, రాహుల అపర్ణ నరేష్, కనికరం శ్రావ్యా రాణి, దుల్గుంటి సుష్మ, మందల అనిత, భోగ పుష్పలత, నాలకొండ సుమలత, మంజుల, సంధ్యారేఖ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్