Tuesday, April 21, 2026

సమృద్ధిగా వర్షాలు పడాలి పంటలు పండాలి: ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -

సమృద్ధిగా వర్షాలు పడాలి పంటలు పండాలి:
ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి

మంత్రి పొన్నం ప్రభాకర్

May abundant rains fall and crops flourish;
May all people live in peace and happiness.

Minister Ponnam Prabhakar

వేములవాడ

శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు వేములవాడలో అందజేత.
శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. శ్రీ రామ నవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న శివార్చన స్టేజి వద్ద శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించామని తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలన్నారు.
వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం: ప్రభుత్వ విప్
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న శివార్చన స్టేజీ వద్ద శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆయన మాట్లాడుతూ. వేములవాడలో శ్రీ సీతారాముల కల్యాణం సంప్రదాయంగా వస్తుందని వివరించారు. కల్యాణానికి 50వేల భక్తులు వస్తారనే అంచనా మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పందిళ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. నూతన వేదిక వద్ద శ్రీ శివ, శ్రీ సీతారాముల కల్యాణం వేడుకలు దేవాదాయ శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని వివరించారు. శ్రీ సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్