బోయినీ చెరువును సందర్శించిన మేయర్

- Advertisement -

బోయినీ చెరువును సందర్శించిన మేయర్

Mayor visited Boini Pond

సికింద్రాబాద్
ఓల్డ్ బోయిన్ పల్లి హరిజన బస్తీ వాసుల నోటీసుల గురించి ప్రభుత్వంతో మాట్లాడుతానని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి బస్తీ వాసులకు మాట్లాడుతానని హామీనిచ్చారు.  గణేష్ ఉత్సవాల సందర్బంగా గణేష్ నిమజ్జనం, ఏర్పాట్ల పరిశీలన కోసం మేయర్ హస్మాత్ పేట్ బోయిన్ చెరువును అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్బంగా నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మికి ఓల్డ్ బోయిన్ పల్లి హరిజన బస్తీ వాసులు కార్పొరేటర్ ముద్దం నరసిహ్మ యాదవ్ ఆద్వర్యంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. నగర మేయర్ గా ఇక్కడి ప్రజల అవస్థలు తనకు తెలుసునని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని హామీ నిచ్చారు. అనంతరం కార్పొరేటర్ ముద్ధం హరిజన బస్తీ వాసులకు అండగా ఉంటానని చెప్పారు. ఇళ్ల రక్షణ కోసం హైడ్రాతో పోరాటం చేస్తానని, అవసరమైతే ఈ భస్తిలోనే నిద్రిస్తానని వారికి భరోసా కల్పించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular