నారా లోకేష్ ను కలిసి విన్నవించిన ఏపీయూడబ్ల్యూ జె (APUWJ)ప్రతినిధుల బృందం.
మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని వర్కింగ్ జర్నలిస్టులకు వేతన సవరణ కోసం వేజ్ బోర్డు ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) ప్రతినిధి బృందం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ను విన్నవించింది. మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి, దేశవ్యాప్త జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ను పురస్కరించుకొని శుక్రవారం ఉండవల్లి లోని నివాసంలో నారా లోకేష్ ను ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృంద సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వినతి పత్రం ద్వారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. దేశంలో వర్కింగ్ జర్నలిస్టులు కోరుతున్న విధంగా మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. జర్నలిస్టులు మీడియా సంస్థల భద్రతకు జాతీయస్థాయిలో ఒక చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు వేతన సవరణ కోసం వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. అన్ని రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆయా డిమాండ్ల పరిష్కారానికి హామీని ఇస్తూ, ఆయా అంశాలను చేర్చాలని తెలిపారు. డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి భక్తవత్సలం, ఐజేయు సభ్యులు ఓ మార్కండేయులు, ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు జొన్న రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా గుంటూరు జిల్లా అధ్యక్షులు సునీల్ సందీప్,ఏపియుడబ్ల్యూజెనాయకులు కె.రమేష్ కుమార్, ఏపియుడబ్ల్యూ జే మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్నా వెంకటేష్, బి సాంబశివరావు (సాంబ) తదితరులు పాల్గొన్నారు.