
హైదరాబాద్ నవంబర్ 11: ;ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ హెల్త్ క్యాంప్ కన్వీనర్ డాక్టర్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో షాహిన్ నగర్ వెంకటాపూర్ లో యునైటెడ్ వాలంటీర్స్ అసోసియేషన్, నిఖ్ఖత్ సహకారంతో నడుస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ లో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు వికలాంగులకు, తెలంగాణ ప్రభుత్వ వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న మొబైల్ మెడికేర్ యూనిట్ లో భాగంగా మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి విచ్చేసి పేషెంట్లకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. రవి హీలియస్ హాస్పిటల్ ఎండి డా. బి. విజయ్ భాస్కర్ గౌడ్ పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యులు పి జ్యోతి, ఫార్మసిస్ట్ ఏపీ లక్ష్మి, యునైటెడ్ వాలంటీర్స్ అసోసియేషన్ యాజమాన్యం మరియు సిబ్బంది, రెడ్ క్రాస్ వాలంటీర్ సుజాత, వెంకట్, మురళి, సయీద్ తదితరులు పాల్గొన్నారు.



