Wednesday, December 18, 2024

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మెగా హెల్త్ క్యాంప్..,

- Advertisement -

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మెగా హెల్త్ క్యాంప్..

Mega Health Camp in Maoist affected area under Police Department.

ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు
ప్రజలకు ఒక పెద్దలాగా, అన్నలాగా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
రామగుండం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని  పోలీస్ కమీషనర్  ఎం. శ్రీనివాస్ అన్నారు. రామగుండము పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల  జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో  నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో దస్నాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కమిషనర్  ఎం.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వేమన్ పల్లి మండలం కల్లంపల్లి, రాజారాం, సంపుటం, దస్నాపూర్, గొర్లపల్లి, కొత్తకాలనీ, జిల్లెడ, జక్కేపల్లి, బుయ్యారం, రాచర్ల, ముల్కల్పేట్, ముక్కిడిగూడెం, సీతారా, చామనపల్లి, బద్దంపల్లి, బమ్మెనా, ఒడ్డుగూడెం, నాగారం, కేతన్పల్లి, కల్మల్పేట గ్రామాల నుండి సుమారు  800 మంది ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. అన్ని విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఈ  సందర్భంగా సిపి  మాట్లాడుతూ….  ప్రజల సమస్యలు, అవసరాల  కోసం, భద్రత కోసం ఒక అన్న లాగా కుటుంబ పెద్దలాగా పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో  ఉంటామని అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం,  అభివృద్ధి కొరకే కమీషనరేట్ పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలియజేసారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రజా శ్రేయస్సును ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఆదివాసి గ్రామస్తులకు, మహిళలకు పోలీసులపై ఉన్న సదాభిప్రాయాన్ని, ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందేలా గ్రామస్తుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధికి చాలా దూరంగా బ్రతుకుతున్న ఆదివాసీలను అభివృద్ధి మార్గం వైపు పయనించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని సిపి గారు తెలిపారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తమ గ్రామంలో కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరడమైనది. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి ప్రజలు తమ ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపేలాగా చూడడమే పోలీసుల  ప్రధాన లక్ష్యం అని అన్నారు. చదువు, క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి, పోలీస్ శాఖ అలాగే ప్రభుత్వం తోడుగా ఉంటుందని అయన పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక పోలీసు అధికారులకు పల్లె నిద్ర కార్యక్రమం లో భాగంగా మీ వద్దకు వచ్చిన అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కరించడం జరుగుతుంది అని గ్రామ ప్రజలకు తెలియజేశారు.  గ్రామాల్లోని యువత బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో చేరి, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని, తమ గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం అక్కడ పాల్గొన్న ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం వృద్దులకు  దుప్పట్లను, యువతకు వాలీబాల్ కిట్లను సిపి పంపిణి చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్