ChiruBobby2 లుక్ టెస్ట్ పూర్తి- ఫస్ట్ ఫోటో రిలీజ్
Megastar’s Look Test Completed — First Photo Released
మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో కలిసి మెగాస్టార్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #ChiruBobby2 చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. లుక్ టెస్ట్ చూస్తుంటే మెగాస్టార్ పవర్‌ఫుల్, స్ట్రైకింగ్ లుక్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.
ఇప్పటికే విడుదలైన హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. చిరంజీవి కొత్త షేడ్‌లో కనిపించనున్నట్లు పోస్టర్ హింట్ ఇచ్చింది. ‘వాల్తేర్ వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మాస్ ఎంటర్టైన్మెంట్‌ను తనదైన స్టైల్‌లో అద్భుతంగా అందించే బాబీ కొల్లి, ఈసారి మెగాస్టార్ కోసం మరింత ఇంటెన్స్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధమౌతోంది. ఈ కాంబో నుంచి హై-ఆక్టేన్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ రాబోతుంది.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. అభిమానులు, సినీప్రేక్షకులు ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అఫీషియల్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగాస్టార్ లుక్ టెస్ట్ పూర్తి
కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి మెగా158 కోసం లుక్ టెస్ట్ పూర్తి చేశారు. ముహూర్తం, షూటింగ్ అప్డేట్స్ త్వరలో వెల్లడిస్తాం” అని పేర్కొంది. దర్శకుడు బాబీ కూడా స్పందిస్తూ.. “లుక్ టెస్ట్ పూర్తయింది. మెగాస్టార్ చిరంజీవి గారి లుక్ను లాక్ చేశాం. ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అని తన ఆనందాన్ని పంచుకున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో “The blade that set the bloody benchmark” (రక్తపు సరిహద్దులను నిర్దేశించిన కత్తి) అనే ట్యాగ్లైన్తో, గోడను చీల్చుకుంటూ వచ్చిన గొడ్డలితో ఉన్న పోస్టర్ను విడుదల చేశారు. ఇది సినిమా ఎంత పవర్ఫుల్గా ఉండబోతోందో సూచించింది. అప్పుడు చిరంజీవి కూడా స్పందిస్తూ.. “ప్రియమైన బాబీతో, కేవీఎన్ ప్రొడక్షన్స్తో మరోసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది” అని తెలిపారు.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి



