తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మేకల వెంకట సుబ్బమ్మ

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మేకల వెంకట సుబ్బమ్మ
హైదరాబాద్ ఏప్రిల్ 7

Mekala Venkata Subbamma appointed as General Secretary of Telangana State Mahila Congress

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా షేర్ లింగంపల్లి కి చెందిన మేకల వెంకట సుబ్బమ్మ నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబ ఆదేశాల మేరకు వెంకటసుబ్బమ్మను తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ మేరకు గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు చేతుల మీదుగా వెంకట సుబ్బమ్మ నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం మేకల వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ తనపై గల నమ్మకంతో తనను మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు గాను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు అందుకు సహకరించిన మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కాలాంబకు ధన్యవాదాలు తెలిపారు. ఇకనుండి తాను మహిళా కాంగ్రెస్ క్రియాశీలక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మహిళా సమస్యలపై పోరాటం చేస్తానని ఆమె తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular