అయ్యప్ప దీక్ష తీసుకున్న ఎస్సైకి మెమో జారీ
పోలీసు శాఖ తీరు పై సర్వత్రా విమర్శలు
హైదరాబాద్
Memo issued to SI who took Ayyappa deeksha
సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీకాంత్, కంచన్బాగ్ ఎస్ఐ ఎస్. కృష్ణకాంత్కు మెమో జారీ చేశారు. విధి నిర్వహణ సమయంలో అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటు అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేశారు.అయ్యప్ప మాల వేసుకుంటే సెలవులు తీసుకోవాలని తెలుపుతూ మేమె ఇచ్చారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ—మతాచరణకు సంబంధించిన అంశాల్లో పోలీసు శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర పండుగలు, ఇతర మతాల సందర్భాల్లో పోలీసులు వ్యవహరించే తీరు, అదే సమయంలో ఈ చర్య తీసుకోవడం ప్రజల్లో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పారదర్శక వివరణ ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఇతర మతాల పండుగలకు గిఫ్టులు ఇస్తూ, మరో మతం వారికి ఉపవాసాలు భోజనాలు పెడుతున్న పోలీసుల తీరు ఇలా అంటూ ప్రశ్నించారు


