- Advertisement -
ప్యారానగర్ లో అర్ధరాత్రి హైడ్రామా
Midnight Hydrama in Paranagar
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ లో నూతనంగా నిర్మిస్తున్న డంపుయార్డు విషయంపై గుమ్మడిదల మండలానికి చెందిన కాంగ్రెస్, బిఆర్ఎస్ ఇరుపార్టీల నాయకులని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసారు. జీహెచ్ఎంసి కి చెందిన వందల టిప్పర్లతో ప్యారానగర్ లో అర్ధరాత్రి డంపూయార్డు నిర్మాణపనులను అధికార యంత్రాంగం చకచకా నడిపించింది. పోలీసులు ఎలాంటి అల్లర్లు కాకుండా ముందస్తు అరెస్టులు చేసి,భారీగా బందోబస్తూ ఏర్పాటు చేసారు. ఒకవైపు అరెస్టులు, మరోవైపు డంపూయార్డు పనులతో అర్ధరాత్రి ప్యారానగర్,నల్లవల్లి గ్రామప్రజలు ఉలిక్కిపడ్డారు. మొదటి నుండి డంపూయార్దు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థా నినాదాలు చేస్తున్నారు.
ప్యారానగర్ లో డంపూయార్డు నిర్మానాలు చేపట్టవద్దంటూ గతంలోనే ధర్నాలు,రాస్తో రోకోలు చేస్తూ,అటూ అధికారులకు,ఇటూ రాజకీయ నాయకులకు కలిసి గుమ్మడిదల మండలానికి సంబందించిన ఇరుపార్టీల నాయకులు,ప్రజలు వినతి పత్రాలు ఇచ్చారు. గతప్రభుత్వం డంపూయార్దు నిర్మాణాలకు అన్ని అనుమతులు ఇవ్వడంతో,ఈ ప్రభుత్వం అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
- Advertisement -