చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు కల్పించాలి*
Minimum facilities should be provided at Chakali Ailamma University*
*బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు విజ్ఞప్తి*
హైదరాబాదు కోఠీ లోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా విద్యార్థులను ఇబ్బందులు చేస్తున్న అధికారులపై తక్షణ చర్యలు చేపట్టాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాదులోని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో…. తమ సమస్యలు పరిష్కరించాలని గురువారంనాడు 10 గంటల నుంచి స్టూడెంట్స్ బైఠాయించి ఆందోళన చేస్తున్న ఎవరుకూడ అటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం బాధాకరమని, హాస్టల్లో కనీసం మంచినీటి వసతి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సోది కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని, ఒకవైపు సౌకర్యాల లేమి, మరోవైపు పాములు ఎలుకల బెడదతో విద్యార్థినులు ఎదుర్కొట్టిన ధైన్య పరిస్థితి ఆందోళన కరమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఊకదoపుడు ఉపన్యాసాలు ఇవ్వడం సరి కాదని, భావి భారత నిర్మాణానికి దశా దిశా చేసే దిక్సూచుకలైన విద్యార్థుల సమస్యల పట్ల తక్షణమే ముఖ్యమంత్రి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ సందర్శించి వారి కష్టసుఖాలను ప్రత్యక్షంగా పరిశీలించి వారి సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఒకవైపు మహిళల ఆత్మ గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని భంగపరిచే అందాల పోటీలను బహిష్కరించాలని మహిళలు చేసే విజ్ఞప్తి కూడా ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకోవాలని, ఈ ప్రభుత్వం మీద మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి గమనంలో ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు


