- Advertisement -
అమృత్ జల పథకాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ
Minister Damodara Rajanarsimha launched the Amrit Jala scheme
సంగారెడ్డి
సంగారెడ్డి పట్టణం లో పురపాలక శాఖ ఆద్వర్యం లో పట్టణం లో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయాలనే సంకల్పం తో 44 కోట్ల రూపాయలతో అమృత్ జల పథకాన్ని రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పర్యటన లో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయ భవనాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు.అనంతరం, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రం లో మహిళల చేత నిర్వచించే తోలి పెట్రోల్ పంపు ను 2 కోట్ల రూపాయలతో ఇండియన్ ఆయిల్ పంపు ఏర్పాటు కు శంకుస్థాపన చేశారు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..
రాష్ట్రంలో సంగారెడ్డి లో మహిళల ఆధ్వర్యంలో తొలి పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. మహిళలు చదువుకుంటే సమాజంలో ఒక మార్పు వస్తుందన్నారు. శ్రీమతి సావిత్రి భాయ్ ఫూలే గారి స్ఫూర్తిని తీసుకుని ముందుకు పోవాలని మహిళల కు పిలుపునిచ్చారు. 1993లో ఆందోల్ లో మహిళా సంఘాలకు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించామన్నారు. మహిళలు సంపూర్ణంగా అన్ని రంగాలలో ఎదగాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు. స్వయం ఉపాధిని పెంచుకునే విధంగా మహిళలు ఆలోచించాలని సూచించారు. విద్యతో ధైర్యం, స్థైర్యం పెరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళలు ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు.మహిళా సమాఖ్య సభ్యులు అనేక అభివృద్ధి పనులతో పాటు స్వయం ఉపాధి సాధించేలా తమ కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు . మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్య కు ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయల ను అందించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘు నందన్ రావు, స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, ఫహీం,కలెక్టర్ క్రాంతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గోన్నారు.
- Advertisement -