12.2 C
New York
Wednesday, April 24, 2024

ఎంఎన్జె ఆసుపత్రిలో మంత్రి దామోదర్ పర్యటన

- Advertisement -

ఎంఎన్జె ఆసుపత్రిలో మంత్రి దామోదర్ పర్యటన
హైదరాబాద్
హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, హైదరాబాదులోని ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆస్పత్రి లో ఏర్పాటు చేసిన శానిటేషన్, సెక్యూరిటీ అండ్ క్యాన్సర్ నివారణకు అవసరమైన అవగాహన సెంటర్ లను పరిశీలించారు.
ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రి లో శ్రీనివాసన్ మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఒకటిన్నర సంవత్సరాల నుండి డా. శరత్ అద్దంకి తన సొంత వ్యయంతో ఆస్పత్రిలో చేపడుతున్న  శానిటేషన్, సెక్యూరిటీ అండ్ అవేర్నెస్ కార్యక్రమాలను  గవర్నర్ దత్తాత్రేయ,  రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహా   అభినందించారు. రోగుల కు అవసరమైన సదుపాయల కల్పనలో ఎన్నారైలు , ఫార్మా కంపెనీలు స్వచ్ఛందంగా తమ సేవా కార్యక్రమాలను, సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు కల్పనకు ఉపయోగించాలని ఆకాంక్షించారు. ఎం.ఎన్.జే ఆస్పత్రి అందిస్తున్న వైద్య సేవలను డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు  వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ క్యాన్సర్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శరత్ అద్దంకి, ట్రస్టీ మిక్ గల్లెర్, ప్రోగ్రాం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంఎన్జె  క్యాన్సర్ ఆస్పత్రిలోనే వివిధ విభాగాల ప్రొఫెసర్లు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!