- Advertisement -
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త, పాలకుర్తి నియోజకవర్గం గూడూరు కు చెందిన, హైదరాబాద్ లో ఉంటున్న చుక్కా రామయ్య ను వారి ఇంటికి వెళ్ళి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఆయనతో కొద్ది సేపు మాట్లాడి, ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తాను పాలకుర్తి బి అర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. త్వరలోనే వచ్చి కలుస్తామని మాట ఇచ్చారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, గతంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చుక్కా రామయ్య ను కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో వచ్చిన సమస్యలతో సతమతం అవుతున్న రామయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -



