- Advertisement -
కేసు నమోదు చేసిన పోలీసులు
నిర్మల్ నవంబర్ 30: ఎన్నికల నిబంధనలు అతిక్రమించారనే ఫిర్యాదుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఎల్లపెల్లి లో పార్టీ కండువా వేసుకుని ఇంద్రకరణ్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కండువాతోనే ఓటు వేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ప్రతిపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈనెల 28న ప్రచారం ముగిసింది. పార్టీ గుర్తులు కనిపించేలా చేయటం, ఫలనా గుర్తుకు ఓటు వేయాలని చెప్పటం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆ నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ కేంద్రానికి ఆయన సింబల్‌తో కూడిన పార్టీ కండువా వేసుకుని వెళ్లటం గమనార్హం. ఆయన తీరుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
- Advertisement -



