Sunday, February 15, 2026

మామునూరు ఎయిర్ పోర్టు పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

- Advertisement -

మామునూరు ఎయిర్ పోర్టు పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

Minister Komati Reddy's review of Mamunur Airport

హైదరాబాద్
మామునూర్ ఎయిర్ పోర్ట్ పై ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ జరిపారు.  సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో సమావేశం జరిగింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎవియేషన్ డైరెక్టర్ భారత్ రెడ్డి, ఆర్  & బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరిచందన, ఇతర ఉన్నతాధికారులు హజరయ్యారు.
మంత్రి మాట్లాడుతూ  తాత్కాలిక ఏర్పట్లకన్న భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చేయాలని అధికారులకు సూచించారు.  త్వరితగతిన భూసేకరణ పూర్తిచేసి మూడేండ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి.  ప్రతీ పదిహేను రోజులకోసారి పనుల పురోగతిపై రివ్యూ చేస్తానని అన్నారు.  గత ప్రభుత్వంలాగా హామీలతో కాలం వెల్లబుచ్చితే అర్ధం లేదు.  విమానాశ్రయం నిర్మించి వదిలేయకుండా విమానాల రాకపోకలపై దృష్టిపెట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారులకు సూచించారు.  వరంగల్ ఎయిర్ పోర్ట్ ను ఉడాన్ స్కీంతో అనుసంధానం చేసి ఇతర పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చాలని సూచించారు.  యునెస్కో సైట్ రామప్ప, భద్రకాళీ, వెయ్యిస్తంభాల దేవాలయం ఇతర కాకతీయ కట్టడాలతో పాటు టెక్స్ టైల్ పార్క్ అవసరాలు, భవిష్యత్ పరిశ్రమలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దాలని సూచించారు. * స్థానిక నాయకులు, అధికారులతో కలిసి స్వయంగా మామునూర్ వచ్చి ఎయిర్ పోర్ట్ స్థితిగతులపై పరిశీలిస్తానన్రనారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్