కేటీఆర్‌కు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు

- Advertisement -

కేటీఆర్‌కు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు
కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు వ్యాఖ్య
హైద‌రాబాద్

Minister Konda Surekha apologizes to KTR
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మాజీ మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కొంతకాలం క్రితం అక్కినేని నాగచైతన్య – సమంతల విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాగార్జున కుటుంబంతో పాటు, కేటీఆర్ కూడా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కోర్టు విచారణ, న్యాయపరమైన చర్యలు వేగవంతం అవ్వడం, మరోవైపు రాజకీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తడంతో ఈ వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
పరువు నష్టం దావాలు, తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఈ వివాదంపై వెనక్కి తగ్గారు. కేటీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై గతంలో తాను చేసిన వ్యక్తిగత, నిరాధార వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రకటించారు. కేవలం అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలోనే ఆ మాటలు అన్నానని, వారిని వ్యక్తిగతంగా బాధపెట్టాలన్న దురుద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కొన్ని వ్యాఖ్యలు నిరాధారమైనవని, అలా మాట్లాడకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. తన మాటల వల్ల వారి కుటుంబం నొచ్చుకుని ఉంటే చింతిస్తున్నానని విచారం వ్యక్తం చేస్తూ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular