హైదరాబాద్ నవంబర్ 30: తెలంగాణ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకుని తన బాధ్యత నెరవేర్చానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. బంజారాహిల్స్ నందినగర్ లో గల ఓ పోలింగ్ బూత్‌లో భార్యతో కలిసి ఓటు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు మొదలైంది. దీంతో ప్రజలు, సినీ రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్ లో గల ఓ పోలింగ్ బూత్‌లో భార్యతో కలిసి ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే ఓటు వేశానని తెలిపారు. ‘తెలంగాణ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకుని నా బాధ్యత నెరవేర్చా. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశా. తెలంగాణలో ఓటు ఉన్న పౌరులంతా ముందుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా పట్టణ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయండి. ఓటు వేసి మీ హక్కును కాపాడుకోండి’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్
Published By Voice Today Team
218
- Advertisement -
- Advertisement -
- Tags
- it minister ktr
- ktr says people should exercise their right to vote
- minister ktr
- minister ktr casts his vote
- minister ktr casts his vote in ghmc
- minister ktr casts his vote in ghmc elections 2020
- minister ktr request to voters
- minister ktr serious on people who doesn't utilize their voting right
- right to vote in india
- right to vote telugu short film
- your ability to exercise your right to vote - ktr
- your right to vote



