Saturday, March 7, 2026

పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ

- Advertisement -

పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ

Minister Narayana Distributed the Pensions
నెల్లూరు

ఇచ్చిన మాటకు కట్టుబడి… రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యే యంగా కూటమి ప్రభుత్వం వ్యూ హాత్మకంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు 11 వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయ ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజాము 6 గంటల నుంచే అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులైన వారందరికి పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధంగా చెప్పిన సమయానికి పెన్షన్ పంపిణీ చేయడం మూడో నెల అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతినెల ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ చేయాలని ఉన్నప్పటికీ… ఈ నెలలో మాత్రం ఒకటో తేదీ ఆదివారం రావడంతో అధికారుల ను ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశం తోనే ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలి పారు. అయితే ఈ క్రమంలో రెండవ తేదీ పెన్షన్ ఇవ్వాలని సూచించిన… ఇచ్చిన మాట ప్రకారం ఒకటే తేది పింఛన్ పంపిణీ చేయాలని, ఒకటో తేదీ ఆదివారం వచ్చిన నేపథ్యంలో సీఎం నిర్ణయంతో ఓ రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ నగదును ఇంటింటి కెళ్ళి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్