- Advertisement -
తాడికల్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం
Minister Ponnam inspected the wood purchase center in Tadical
కరీంనగర్
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని వడ్లు కొనుగోలు చేసిన 24 గంటల లోపే ధాన్యం డబ్బులు పడుతున్నాయని మంత్రి కి రైతులు వివరించారు. ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలు కి క్వింటాలు కి 500 బోనస్ ఇస్తుందని మంత్రి తెలిపారు. తనకి బోనస్ డబ్బులు జమ అయ్యాయని మంత్రి కి రైతులు చూపించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రతిపక్షాలు కావాలని కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామా లు చేశారని రైతులకు ఎక్కడ ఇబ్బందులు లేవని తెలిపారు..
- Advertisement -