- Advertisement -
ముత్యాలమ్మ విగ్రహ పునః ప్రతిష్ఠలో పాల్గోన్న మంత్రి పొన్నం
Minister Ponnam participated in the rededication of Mutyalamma idol
సికింద్రాబాద్
సికింద్రాబాద్ కుమ్మరిగూడ లో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గోన్నారు. అమ్మవారికి పార్టీ వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో సికింద్రాబాద్ ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం స్పందించి స్థానిక శాసన సభ్యుడి విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందజేసే విధంగా వేద పండితులతో పునఃప్రతిష్ఠ చేసుకొని దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నం . ఎక్కడైనా దేవాలయాలు ప్రార్థన మందిరాల పట్ల రాజకీయం మంచిది కాదు. ఆ ముత్యాలమ్మ వారికి రెండు చేతులు జోడించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించా. దేవాలయాలను కాపాడుకోవాలి విద్రోహం జరిగినపుడు అందరం కలిసి ఎదుర్కోవాలి కానీ రాజకీయాలు తగదు. ప్రజల విశ్వాసం కాపాడేలా మా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు.
- Advertisement -