- Advertisement -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర ద్రిగ్బాంతి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar expressed deep grief over death of former Prime Minister Manmohan Singh
హైదరాబాద్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ధ్రిగ్బాంతి వ్యక్తం చేశారు. 15 వ లోక్ సభ లో ఆయన ప్రధాని గా నేను లోక్ సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన తో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 2004 – 14 మధ్య దేశ ప్రధాని గా ఆయన ఎన్నో సేవలు చేశారని ఉపాధి హామీ , సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాలు ప్రధాని గా చేసిన అత్యంత నిరడంబరుడుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -