- Advertisement -
వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేసిన మంత్రి సీతక్క
Minister Sitakka distributed blankets to the disabledహైదరాబాద్
వికలాంగుల పెన్షన్ల పెంపు, ఇతర పెండింగ్ సమస్యలను త్వరలో పరిష్కరించనున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మలక్ పేట బదిరుల ఆశ్రమ పాఠశాల, మాసబ్ ట్యాంక్ లోని అంధుల పాఠశాల, సరూర్ నగర్ లోని వికలాంగుల పాఠశాల లో వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య తో కలిసి విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మలక్ పేటలో మంత్రి మాట్లాడుతూ మూగ చవిటి విద్యార్థులకు కేవలం పదో తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయని, త్వరలో ఇంటర్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. వికలాంగులకు పింఛన్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో వేసేందుకు సానుకూలంగా ఉన్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్. వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -




