గణతంత్ర దినోత్సవ వేడుకల పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్
75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంవత్సరం పాటు ప్రజా రాజ్యాధికార ఉత్సవం పేరుతో నిర్వహించదలచిన కార్యక్రమాల పోస్టర్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీ రాజ్&మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారిచే అవిష్కరింపచేయడం జరిగింది ఈ సందర్భంగా STSA రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ళ అజయ్ మాట్లాడుతూ 75 సంవత్సరాల గణతంత్ర దేశంలో భారత రాజ్యాంగం ద్వారా ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం,హక్కుల తో జీవిస్తున్నారని రాజ్యాంగ విలువలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాక్ ఓటింగ్,మాక్ అసెంబ్లీ, రాజ్యంగ పీఠిక పఠనం, పుస్తకాల పంపిణీ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ లకు సామాజిక న్యాయం అందే విధంగా పోరాటం చేస్తామని పేర్కొన్నాడు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు లింగంపల్లి మనోజ్, గుగ్గిళ్ళ మధు,అజ్జమారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల పోస్టర్ ను విడుదల చేసిన మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -