డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

జయశంకర్ భూపాలపల్లి.

Minister Sridhar Babu inaugurates digital library.

వివిధ ప్రభుత్వ ఉద్యోగాల సాధన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు డిజిటల్ లైబ్రరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిటల్ లైబ్రరీలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థులతో మంత్రి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ గ్రంథాలయాల్లో అందుబాటులో లేని పుస్తకాలను సైతం ఈ-లైబ్రరీ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా చదివే అవకాశం ఉంటుందని తెలిపారు.  పోటీ పరీక్షలకు అవసరమైన నాణ్యమైన అధ్యయన సామగ్రిని డిజిటల్ రూపంలో పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు డిజిటల్ లైబ్రరీ ఎంతగానో తోడ్పడుతుందని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు.
జిల్లాలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకొని, 10 కంప్యూటర్లు, అవసరమైన ఫర్నిచర్ సమకూర్చిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, గ్రంథాలయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, లైబ్రేరియన్ శారద, ప్రజాప్రతినిధులు, పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular