- Advertisement -
జగిత్యాల ఎపిసోడ్ పై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu responded to the Jagityala episode
గాంధీ భవన్
జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్ పై సీరియస్ గా ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మర్డర్ ఎవరు చేసినా ఎవరు చేయించినా వదిలేది లేదు. జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడటం జరిగింది. జీవన్ రెడ్డితో ఇప్పటికే పీసీసీ చీఫ్ మాట్లాడారు. జీవన్ రెడ్డి తో నేను కూడా మాట్లాడుతా. జీవన్ రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత.. ఆయన సేవలను మేము వినియోగించుకుంటాం . పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించం. చనిపోయిన బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు తావు లేదని అన్నారు.
- Advertisement -