మంత్రి  శ్రీనివాస గౌడ్ కు హైకోర్టులో ఊరట

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 10:  తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ హైకోర్టు కొట్టేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల చెల్లదంటూ 2019లో మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి మళ్లీ వెనక్కు తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తాజాగా పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది.

Minister Srinivasa Goud's plea in the High Court
Minister Srinivasa Goud’s plea in the High Court
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular