- Advertisement -
మహేంద్ర హిల్స్ గురుకులంలో మంత్రి ఉత్తమ్ కుమార్
Minister Uttam Kumar at Mahendra Hills Gurukulam
సికింద్రాబాద్..
మహేంద్ర హిల్స్ లోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నూతనంగా కామన్ డైట్ మెనూ ను ప్రారంభించారు.అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 25 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును బంగారు మాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 8 సంవత్సరాల తర్వాత డైట్ మెనూ చార్జీలు 40 శాతం పెంచినట్లు, కాస్మోటిక్ కోసం 200 శాతం పెంపొందించినట్లు తెలిపారు. డైట్ మెనూ కాస్మెటిక్స్ పెంపు మూలంగా ప్రభుత్వానికి 470 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించారు. గురుకులాలతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో విద్యార్థులకు పౌష్టిక బలవర్ధక ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -