- Advertisement -
సింహాద్రి అప్పన్నాను దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్
Minister Vasamshetty Subhash visited Simhadri Appannaవిశాఖపట్నం
ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామి వారిని రాష్ట్ర కార్మిక,కర్మాగారాల శాఖామంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఆలయ ప్రధాన అర్చకులు మంత్రికి పూర్ణకుంభం వేద ఆశీర్వచనాలతో ఆలయంలోకి స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని మంత్రి సుభాష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకుని స్వామివారి బెడ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి స్వామివారిని ప్రార్ధించారు అనంతరం ఆలయ ఈఓ కార్మిక,కర్మాగారాలు శాఖ మంత్రికి శాలువ కప్పి స్వామివారి ప్రసాదంతోపాటు చిత్రపటాన్ని బహుకరించారు.
- Advertisement -




