- Advertisement -
ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు
Ministers launched electric buses
హన్మకొండ
హన్మకొండలోని టిజిఎస్ ఆర్టీసి బస్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గోన్నారు. కొబ్బరికాయ కొట్టి బస్సులను ప్రారంభించారుఏ. తరువాత కొత్తగా ప్రారంభించిన బస్సులో న మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎంపి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తెలంగాణ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ లు ప్రావీణ్య, సత్య శారద తదితరులు ప్రయాణించారు.
- Advertisement -