Sunday, September 8, 2024

నూతన బస్సులను ప్రారంభించిన మంత్రులు

- Advertisement -

నల్లగొండ బస్ స్టాండ్ లో నూతన బస్సులను మంత్రులు కోమటి రెడ్డి, పొన్నం ప్రభాకర్
నల్లగొండ

Ministers launched new buses

నల్లగొండ  నుండి రాజధాని హైదారాబాద్ కి 3 డీలక్స్, ఒక ఏసీ బస్సు, ఒక పల్లె వెలుగు బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు.తరువాత  బస్ స్టాండ్ నుండి జ్యోతిరావు పూలే భవన్ వరకు బస్సులో ప్రయాణం చేసారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ నల్గొండకి సంబంధించి ఆర్టీసి పరంగా తీసుకోవాల్సిన అంశాల పై మంత్రి కోమటిరెడ్డి  తెలిపారు. ఏసీ బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా వారికి ధన్యవాదాలు.ఆర్టీసి సంస్థకు ,కార్మికులకు ఉద్యోగులకు రోడ్ల శాఖ మంత్రి గా మీరు అందిస్తున్న సహకారం కి రవాణా మంత్రి గా ధన్యవాదాలు తెలుపుతున్న.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం.నూతనంగా వెయ్యి బస్సులు ప్రారంభించుకున్నం.నల్గొండ జిల్లాలో 7 బస్ డిపోలు, 34 బస్ స్టాండ్లు,రోజుకు 645 బస్సులతో 2 లక్షల 55 వేల కిలోమీటర్లు తిరుగుతూ, దాదాపు 3 లక్షల ప్రయాణికులను తరలిస్తుంది.కొత్తగా బస్సులు కావాలని అడిగారు.దసరా లోపు 7 డిపోలకు 30 ఎక్స్ ప్రెస్, 30 లగ్జరి బస్సులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశానుసారం ఈజిల్లా కి ఇవ్వడం జరుగుతుంది.నార్కెట్ పల్లి బస్సు డిపో పునర్వైభవం తీసుకొస్తాం.అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపేవిధంగా చర్యలు తీసుకుంటుంది.తెలంగాణలో ఆర్టీసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ప్రయాణం అందిస్తున్నాం. ఆర్టీసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ పెండింగ్ బాండ్స్ ఏరియల్స్ ఇచ్చాం. ఇప్పటికీ 280 కోట్లలో 80 కోట్లు చెల్లించాం. మిగిలినవి  త్వరలో వాళ్ల ఖాతాలో వేస్తమనా అన్నారు.
ఆర్టీసి 3035 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చాం. నియామక ప్రక్రియ చేపడుతున్నాం
ఇప్పటికే వెయ్యి బస్సులు కొనుగోలు చేశాం. మరో 1500 బస్సులు త్వరలోనే రొడ్డెక్కనున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసి ఆపరేషన్ లాస్ లేకుండా చూస్తున్నాం. ప్రభుత్వ సహకారం తో రోజు వారి నష్టాలు లేకుండా చూస్తున్నామని అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ నుండి హైదారాబాద్ కి ఏసీ బస్సులు ప్రారంభించాం. అన్ని జిల్లా కేంద్రాల్లో నుండి హైదరాబాద్ కి ఏసీ బస్సులు నడిపిస్తాం. అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు బస్సులు నడిపిస్తాం. ప్రభుత్వ సహకారంతో లక్షల మంది ప్రయాణికులు రోజు ప్రయాణం చేస్తున్నారు. సురక్షితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసి గమ్య స్థానాలకు చేరుస్తుంది. అన్న రోడ్లు, భవనాలు మంత్రి గా  నేను, రవాణా మంత్రులుగా కలిసి సమన్వయం తో పని చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారానికి, ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. గతంలో నిర్వీర్యం చేయబడ్డ ఆర్టీసి నీ రక్షించుకుని ప్రజల ప్రయాణానికి ఉపయోగపడే ఆర్టీసి బస్సులను, బస్ స్టాండ్ లను పునరుద్ధరిస్తామని. నార్కెట్ పల్లి డిపో పూర్వవైభవం తెస్తాం. నల్గొండ నుండి తిరుపతి కి త్వరలోనే బస్సు ప్రారంభిస్తామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్