తాగునీటిని విడుదల చేసిన మంత్రులు
Ministers released drinking water :
విజయవాడ
500 క్యూసెక్కుల త్రాగునీటిని ఇరిగేషన్ మంత్రి రామానాయుడు, ఇతర మంత్రులు బుధవారం విడుదల చేసారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ నీరు లేకపోతే ప్రాణం నిలవదు. త్రాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్. కొత్త ఆయకట్టుకు కూడా సాగు నీరు ఇవ్వడం రాష్ట్రాన్ని రక్షించుకోవడం. జగన్ పాలనతో ఇరిగేషన్ ను 20 ఏళ్ళ వెనక్కు నెట్టేసాడని అన్నారు.
ఏపీ విభజన వల్ల వచ్చిన నష్టం కంటే జగన్ పాలన వల్ల ఇరిగేషన్ వచ్చిన నష్టం ఎక్కువ. సాగునీటికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. పట్టిసీమ లిఫ్ట్ నుంచీ వచ్చిన నీళ్ళు ఇప్పుడు కృష్ణా డెల్టాలో దాహార్తి తీరుస్తున్నాయి. వైసీపీ నేతలు కళ్ళు తెరుచుకుని ఇదంతా చూడాలి. ఇసుక మీద 40వేలు కోట్లు ఎలా కొట్టేయచ్చు, భూములు మైన్స్ ఎలా లోబరుచుకోవచ్చు అనే దానిపైనే వైసీపీ దృష్టి పెట్టింది. జగన్ కు రాజకీయాలలో ఉండే అర్హత లేదు అని చెపుతున్నాం. పులిచింతల లో బ్యాలన్సింగ్ రిజర్వాయర్ 30 టీఎంసీలు ఉంచే వాళ్ళం. జగన్ విధ్వంసం కారణంగా ఇప్పుడు 0.5 టీఎంసీలు కూడా లేదు. జగన్ పాలనలో నష్టపోయిన వాటిని సరి చేస్తాం. వైకుంఠపురం ప్రాజెక్టు కూడా చంద్రబాబు ప్రణాళికలో ముఖ్యమైనది. ఐదేళ్ళలో వదిలేసిన వాటిని సరిచేసి నాలుగు ఎత్తిపోతలు ఒకే రోజు ప్రారంభించాం. తాడిపూడి నుంచీ కూడా కొంత కలిపి ప్రకాశం బ్యారేజికి నీటిని తీసుకొచ్చాం. గత ప్రభుత్వం కెనాల్స్ లో కానీ డ్రెయిన్స్ లో కానీ పూడికలు తీయలేదు. కెనాల్స్, డ్రెయిన్స్ లో గుర్రపు డెక్క ఉండిపోయింది. వారం లోపల కాలువలు, డ్రెయిన్స్ కూడా పూర్తిగా శుభ్రం చేయబడతాయి. 7.38లక్షల ఎకరాల స్ధిరీకరణకు మేం విడుదల చేయబోయే నీరు ఉపయోగపడుతుంది. 538 చెరువులకు త్రాగునీరు అవసరాలు తీరతాయని అన్నారు.
Ministers released drinking water :
మంత్రి పార్ధసారధి మాట్లాడుతూ పంటలు మునిగిపోయిన పరిస్ధితులు గత నాలుగైదు సంవత్సరాలలో చూసాం. అవనిగడ్డ, బందరు రైతులు ఈ ఇరిగేషన్ పూడికలు తీయకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం ఏది ముందు ఏది తరువాత తెలీకుండా చేయడం వల్ల ఇదంతా జరిగింది. చింతలపూడి ప్రాజెక్టుకు సరైన నీటి సరఫరా లేకపోవడం చాలా ఇబ్బందులకు గురి చేసింది. నూజివీడు, మైలవరం, తిరువూరు, చింతలపూడి ప్రాంతాలకు ఫ్లోరైడ్ సమస్య వచ్చే అవకాశం ఉందని అన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పులిచింతలలో నీరు లేకపోవడానికి కారణం గత సీఎం కాదా. వృధాగా నీటిని సముద్రంలోకి వదిలేసారు. పట్టిసీమ పంపులు లేకపోతే కృష్ణాజిల్లా ప్రజల పరిస్ధితి ఏమయ్యేదో చూడండి. ప్రజల అవసరాలు తీర్చే పనులు ఎక్కడా జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో అన్నీ జరుగుతున్నాయని అన్నారు.