- Advertisement -
ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల సమీక్ష
Minister's review of irrigation projects
అమరావతి
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల సిఈలు,ఎస్ఈలు,కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్,కడ కమీషనర్ రామసుందరరెడ్డి ,ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు తదితరులు హజరయ్యారు. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పోలవరం లో పర్యటించి డయా ఫ్రం వాల్,ఈసిఆర్ఎఫ్ డ్యాం పనులు షెడ్యూల్ విడుదలపై రివ్యూ చేసారు. పోలవరం టన్నెల్స్ బ్యాలెన్స్ పనులు మరియు లెప్ట్ కెనాల్ పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలి. హంద్రీ-నీవా వెలిగొండ,చింతలపూడి తదితర ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల ఆర్దిక ఇబ్బందులను అధిగమించి పూర్తి చెయ్యడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సాగు నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేవిధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. సాగునీటి సంఘాలకు డిసెంబర్ 8 వ తేదీన జరిగే ఎన్నికల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలి. సాగు నీటి సంఘాల ద్వారా కాలువలు,డ్రైన్స్ వంటి ఇరిగేషన్ పనులలో రైతుల భాగస్వామ్యం ,ప్రాతినిధ్యం లభిస్తుందని అన్నారు.
- Advertisement -