- Advertisement -
వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై మంత్రి తుమ్మల సమీక్ష
Minister's review on the progress of agriculture and allied sectors
హైదరాబాద్
వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత ఎరిగి పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రివర్యుల నుండి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. పరిష్కారంలో జాప్యం పై అసహనం వ్యక్తం చేసారు. అధిక మొత్తంలో సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనం అందేలా వ్యవసాయ యాంత్రికరణను, సూక్ష్మ సేద్య పరికరాలకు మరింతగా ప్రోత్సాహం ఇవ్వాలి. ట్రేడర్లు రైతుల వద్దకు వెళ్ళి కొనేలా రాష్ట్రంలో 3 ఆధునిక మార్కెట్లను అధునాతన హంగులతో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అన్నారు. సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. వర్సిటీలలో ప్రస్తుతమున్న మౌళిక సదుపాయాల వృద్దికి మరియు కొత్త భవనాల నిర్మాణాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సింది. రైతువేదికల నిర్వహణ ఖర్చుల నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరములో ఇంకో 1000 రైతువేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించాలి. రైతుభరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలి. సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేకదృష్టి పెట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.
- Advertisement -