తప్పిన పింఛన్ కష్టాలు!
Missed pension woes!
మూడు నెలల కోసారి తీసుకునేలావ్యసులుబాటు
టిడిపి నేత మంచూరు సూర్యనారాయణ రెడ్డి
బద్వేలు,
వివిధ కారణాలతో ప్రతి నెల కొందరు లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందుకోలేకపోతున్నారు ఇలాంటి వారితో పాటు పింఛన్ దారులందరికీ కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించిందని బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ క్లాస్ వన్ రైల్వే కాంట్రాక్టర్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా మూడోనెలతో కలిపి మొత్తం తీసుకునేలా వెసులుబాటు కూటమి ప్రభుత్వం కల్పించింది కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్ మొత్తాన్ని3 వేల నుంచి 4 వేలకు పెంచింది ఏప్రిల్ నుంచి జూన్ వరకు కలిపి జూలైలో లబ్ధిదారులకు 7 వేలు అందించింది. విభిన్న ప్రతిభావంతులకు 6 వేలు వ్యాధిగ్రస్తులకు తీవ్రత మేరకు 10 వేలు,15 వేలు అందజేస్తుంది. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా వలస కూలీల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం మూడు నెలలకు ఒకేసారి లబ్ధి పొందడానికి అవకాశం కల్పించింది 2019లో ఏర్పడిన వైకాపా ప్రభుత్వం మూడు నెలలకోసారి పింఛన్ పొందే విధానాన్ని రద్దు చేసింది. జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లిన లబ్ధిదారులు ఆ నెలలో సొమ్ము వదులుకోవాల్సి వచ్చేది. దీన్ని కూటమి ప్రభుత్వం పున రుద్దరిస్తూమార్గదర్శకాలు జారీ చేసింది తక్షణం వీటిని అమలు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. కడప జిల్లా వ్యాప్తంగా7 నియోజకవర్గాల్లో2,58,918 మంది పింఛన్దారులకు కోట్లు రు11,041.88 లక్షలు ప్రభుత్వం ప్రతినెల అందించనుంది అన్నారు. అలాగే బద్వేల్ నియోజకవర్గం లోని అర్బన్ రూరల్ ప్రాంతాల్లో వివిధ21 రకాల పింఛన్లు37,384 మంది పింఛన్దారులకు కోట్ల రు 15,91.09 లక్షలు పొందుతున్నారన్నారు.
*మార్గదర్శకాలు ఇలా:’
ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి సూచన మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో పింఛన్ అందుకొని లబ్ధిదారులకు జనవరిలో రెండు నెలలు కలిపి మొత్తం చెల్లించనున్నారు. డిసెంబర్, జనవరిలో సొమ్ము తీసుకొని వారికి వరుసగా మూడు నెలల పాటు లబ్ధి పొందని వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పింఛన్ నిలిపివేస్తారు. శాశ్వత వలసదారులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎంపీడీవోలు ద్వారా పింఛన్ నిలిచిన మూడు నెలల్లోపు పునరుద్ధరించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.వారికి బకాయిలు అందజేయకుండా ప్రభుత్వం అనుమతించిన నెల నుంచి పింఛన్ అందజేస్తారు.
*సద్వినియోగం చేసుకోవాలి:
ఉపాధి నిమిత్తం వలస వెళ్లేవారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంచూరు సూర్యనారాయణ రెడ్డి తెలుపుతున్నారు. మూడు నెలల కొక సారీ పింఛన్ తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని మంచూరుకోరారు.