- Advertisement -
సాగర్ కుడి కాలువలో విద్యార్థి గల్లంతు
Missing student in the right canal of Sagar
మాచర్ల,
నాగార్జునసాగర్ కుడి కాలంలో విద్యార్థి గల్లంతైన విషాద సంఘటన బుధవారం మాచర్ల సమీపంలోని బొంబాయి కంపెనీ దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామానికి చెందిన తాటిమల్ల కోటేశ్వరరావు(15) బంధువులు లింగాపురం కాలనీలో నివసిస్తుండగా వారిని చూసేందుకు లింగాపురం కాలనీ వచ్చాడు. బుధవారం ఉదయం సాగర్ కుడి కాలువలో స్నానం చేసేందుకు దిగాడు. ఈత రాకపోవడంతో నీటి ఉధృతికి కాలువలో కొట్టుకొని వెళ్ళాడు. గల్లంతైన విద్యార్థి కోసం తల్లిదండ్రులు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -